వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి ది విశాల సహకార సంఘం క్యాలెండర్ 2024ను సొసైటీ అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు గురువారం సంఘం కార్యాలయంలో ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఆవిష్కరించారు.
పాలకవర్గం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకున్నట్లు రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1,279 మంది రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా రైతాంగానికి రూ.10 కోట్లకు పైగా రుణాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
సంఘం డిపాజిట్లు రూ.1 కోటి 40 లక్షలు ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మునిగడప శేషగిరి, పాలక వర్గ సభ్యులు లోకిని సూరయ్య, వెంకట్రావు, కాగితాల శ్రీనివాస్, అయిలయ్య, మహేందర్, సంధ్య, సమ్మక్క, సమ్మయ్య, రాజిరెడ్డి, కృష్ణమూర్తి శర్మ, పోచయ్య, సంఘ కార్యదర్శి జనగాని తిరుపతి, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.