వేద న్యూస్, జమ్మికుంట:
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’కు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ తన బృందం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నారు.
ఈ నెల 20న (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రణవ్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ బృంద సభ్యులు జమ్మికుంట గాంధీ చౌరస్తా నుంచి ఇల్లందకుంట దేవస్థాన చౌరస్తా వరకు పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నాయకులు ప్రవీణ్ శుక్రవారం కోరారు.
