• వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

వేద న్యూస్,వరంగల్ క్రైమ్:
ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదిన నుండి వచ్చే నెల ఫిబ్రవరి 14వ తారీఖు నిర్వహింబడే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకోని వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం, పోలీసు అధికారులు, స్థానిక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బులియన్‌ మర్కెట్‌, ఇతర వ్యాపార సముదాలకు చెందిన కార్యవర్గ సభ్యులు పాల్గోన్న ఈ సమావేశంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గంటకు యాబైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఇందులో 19మంది మరణిస్తున్నారని రోజు రోజుకి వాహనాల సంఖ్య ఘననీయంగా పెరుగడంతో అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ఈ ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలు చిద్రమవుతున్నాయని ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజలు సైతం భాగస్వాములు కావాలని అన్నారు. ఇందుకోసం ముందుస్తూ ప్రణాళిక రూపోందించుకోవాల్సిన అవసరం వుందని హై స్పీడ్‌ వాహనాల వినియోగంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై అవగాన కల్పించాలన్నారు.

అలాగే అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రిమించడం లాంటి చర్యలకు వాహనదారులు పాల్పడకుండా కళాశాల విధ్యార్థులతో పాటు, ప్రజలకు అవగాహన తరగతులను నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకై జాతీయ, స్టేట్‌ ప్రధాన రోడ్డు మార్గాలను కలిపే రోడ్లకు అనుసంధానమైన గ్రామాల్లో రోడ్డ సేఫ్టీ కమీటీలను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాలను శాతాన్ని తగ్గించగలమన్నారు.

ప్యాసింజర్‌ వాహనాలదారుల్లో మార్పు వచ్చే సంబంధిత అధికారులు తగు చర్యలుతీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్‌ సెఫ్టీ విభాగానికి చెందిన ఇన్స్‌స్పెక్టర్‌ రవి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులు పలుసూచనలు చేసారు.

అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రవాణా శాఖ రూపోందించిన వాల్‌పోస్టర్లు కరప్రతాలను పోలీస్‌ కమిషనర్‌ అవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్‌ అఫీసర్‌ పురుషోత్తం, ఆర్టీఓ రంగరావు, ఏసిపిలు జితేందర్‌ రెడ్డి, రమేష్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, యం.వి.ఐలు రమేష్‌ రాథోడ్‌,రవీందర్‌, స్వర్ణలత, షాలిని, ఫహిమా, శ్రీనివాస్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బిలియన్‌ మార్కెట్‌ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌తో ఇతర వ్యాపారస్తులు పాల్గోన్నారు.