వేద న్యూస్,వరంగల్ :
చిన్నారులలో రాముని పట్ల భక్తి భావన పెంపొందించేందుకు బాల రాముని వేషధారణ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని మురుగన్ యాడ్స్ అధినేత రవీందర్ అన్నారు. వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట ఆరంభ వేడుకల్లో భాగంగా శ్రీరామ సీతాదేవి హనుమాన్ వేషధారణలో చిన్నారులకు పోటీలు నిర్వహించారు.

రాముని యొక్క తత్వాన్ని రాజుగా సుపరిపాలన అందించిన గొప్ప యుగపురుషుని జీవిత గాధ పిల్లలకు తల్లిదండ్రులు బోధించడం ఎంతో అవసరమని అన్నారు.

అనంతరం ఈ బాల రాముని వేషధారణల పోటీలలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులతో పాటు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలను అందజేశారు.కాగా ఈ పోటీలలో సుమారు 200 మంది చిన్నారులు పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు.