మనోహరమైన దివ్య స్వరూపము లో
రామా ! తుమ్మెదలాంటి గిరజాల జుట్టుతో,
మిల -మిల కాంతుల కాయముతో,
మువ్వల సవ్వడి అడుగుల తో,
మైమరపించే తొలి తొలి పలుకులతో…..
తన్మయత్వమైనది ఈమది “ఓ బాలరామ”
సూర్యవంశం వరించిన వంశోద్ధారకుడు ,
సుసంపన్న సుగుణాల ధీరుడవై,
దివ్య తేజస్సు కిరణమై వెలుగుతూ .…
.సత్యలోలుడవై పితృవాక్య పాలనలో,
రామా ! భూమండలంలో నీ శతకోటి ప్రాణి
హృదయాల్లో నిలిచినావయ్య ” ఓరఘురామ”
అత్యున్నత జ్ఞానశీలి విశ్వామిత్రుని ఆజ్ఞతో ,
రాజాధిరాజులను, అసురులను ఓడించి.
శివధనస్సు అవలీలగా ఎక్కుపెట్టి ,
అందాలరాశి ,మృదుస్వభావిలాంటి
మనోహరీయమైన సాధ్వీమణి సీతమ్మను
పరిణయమాడిన ” ఓ సీతారామ”
“ఎంతని వర్ణించనయ్య కోదండ పాణి,
మాటలు రావడం లేదయ్యా !!!!!
నీ పావన రూపంతో ,అంతులేని ఆనందం కలిగించి నా హృదయములో కొలువై
నా జన్మ ధన్యము చేసినావు తండ్రీ,
“ఓ అయోధ్య రామ” ” కారుణ్య రామ”
” సద్గుణరూప ” సీతామనోభిరామ”
రామ రామ జయరాజారామా…. శ్రీ రామ!!
కవి: విశ్వనాధ్ సరిత,
చరవాణి :99662 69950
ఊరు: వరంగల్.