వేద న్యూస్, వరంగల్ టౌన్:

జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ శివనగర్ కు చెందిన కుసుమ చందన అనే బాలిక బాపు పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తమ ట్రస్టుచే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే ఏ రంగాలనైనా ప్రతిభ సాధిస్తారని అన్నారు.

కుసుమ చందన ప్రముఖ దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు బాబు పురస్కారంతోపాటు జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రముఖ రచయిత, సినీ నటుడు చేతుల మీదుగాపొందిన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగినదని తెలిపారు.

ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు చేరాలని ఈ సందర్భంగా వారు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుసుమ రామకృష్ణ, పంతంగి సరోజిని, నితీష్ రాపర్తి, కిరణ్ కుమార్, సామ్రాట్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.