వేద న్యూస్, పోచమ్మ మైదాన్:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను వరంగల్ తూర్పు బీఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మ మైదన్ జంక్షన్ లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా నిరుపేద కుటుంబాల పెద్ద కొడుకు గా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్న అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన వ్యక్తి వద్దిరాజు రవిచంద్ర అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొలుగొడ్డు శ్రీనివాస్, బోల్లికొండ విజయలక్ష్మి, తాండ్ర భాస్కర్,మైనార్టీ నాయకులు ఫక్రుద్దీన్, రవిచంద్ర యువసేన సభ్యులు ఏరుకొండ వినయ్, నాగపురి రమేష్ గౌడ్,బొల్లోజు శ్రీనివాస్, నానావరపు సందీప్, ఎండి మాస్, సిరిమల్లె కిరణ్,సురేష్,సాయి,మనీ,రబ్బాని షేక్, షారు,ప్రణయ్, బబ్లు, తారక్,నరేష్,సుమన్,తదితరులు పాల్గొన్నారు.