వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శైవ క్షేత్రంగా వర్ధిల్లుతోన్న కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొత్తకొండ దేవాలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీ లెక్కింపులలో మొత్తం ఆదాయం 27 లక్షల 20 ఒక వెయ్యి 945 945 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులో వెండి రెండు కిలోల 730 గ్రాముల వెండి, ఒక గ్రామ మిశ్రమం బంగారం మరియు 11 అమెరికా డాలర్లు నోట్లు వచ్చాయి.

జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వివిధ వెలముల ద్వారా రూ. 36,16,200, దర్శనం టికెట్ల ద్వారా రూ. 29,53,940 , హుండీ ద్వారా 27,21,945 మొత్తం రూ. 92,92,085 రూ. ల ఆదాయం సమకూరినట్లు, గత సంవత్సరం కన్నా 3,50, 000 అధిక ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి. కిషన్ రావు తెలిపారు. ఈ మేరకు ఈవో ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు, అర్చకులు, స్థానిక నేతలు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.