వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామం మూలమరితండవాసి వాంకుడోత్ రాజమ్మ ఇటీవల సహజంగా మృతిచెందారు. కాగా, రాజమ్మ పేరు మీద తానంచర్ల బ్రాంచ్ తపాలా కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ థర్డ్ పార్టీ అయిన బజాజ్ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.5 వేలు ప్రీమియం చెల్లించారు. ఆ పాలసీ ద్వారా రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో పాలసీదారుకు నామిని అయిన పాలసీదారుని కుమారుడు వాంకుడోత్ వీరన్నకు గురువారం రూ.10 లక్షల ప్రమాద బీమా చెక్కును వరంగల్ డివిజన్ తపాల శాఖ పర్యవేక్షకులు ఎస్.వి.ఎల్.ఎన్ రావు అందజేశారు.
కార్యక్రమంలో తపాల శాఖ తరపున మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు ఎల్.సైదా నాయక్, బజాజ్ మేనేజర్ తెలంగాణ సర్కిల్ సి.హెచ్.రవీందర్, బ్రాంచ్ మేనేజర్ డి. సంపత్ కుమార్, ఐపీపీబీ మేనేజర్ బి. సునీత మేనేజర్, ఎస్పీఎం సుధాకర్, మరిపెడ యస్.వో బి.ప్రశాంత్, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, మరిపెడ ఉప తపాల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తానంచర్ల గ్రామం తరఫున మూలమర్రితండా సర్పంచ్ టి.జగిని లాలు నాయక్, తానంచర్ల సర్పంచ్ డి. శ్వేతా ఝాన్సీ, జి.అనితా దేవి, ప్రధానోపాధ్యాయులు, ఇతర గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు.