వేద న్యూస్, జమ్మికుంట:
ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజశేఖర్ మాట్లాడుతూ భారతదేశ ఎన్నికల సంఘం స్థాపనకు గుర్తుగా దేశవ్యాప్తంగా 2011 సంవత్సరము నుండి జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటున్నామని చెప్పారు.

దీని ప్రధాన లక్ష్యం ముఖ్యంగా కొత్త ఓటర్లను ప్రోత్సహించడం సులభతరం చేయడం, నమోదును పెంచడం అని వివరించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉందని, దేశానికి నాయకత్వం వహించడం..సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడం..మార్పు తీసుకురావడం మొదలైన వాటిలో సమర్థుడని భావించే వారిని తన నాయకుడిని ఎన్నుకునే హక్కు అతనికి లేదా ఆమెకు ఉందని చెప్పారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతీ సంవత్సరం ఒక నిర్దిష్ట థీమ్ తో జరుపుకుంటామని వెల్లడించారు. ఇది యువతను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఓటు హక్కు పై దృష్టి సారించాలని తెలిపారు.

2024 జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించిన థీమ్ ‘‘ నేను కచ్చితంగా ఓటు వేస్తాను’’ అనేది అని చెప్పారు. అది ఓటర్లకు అంకితం చేయబడినది అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజశేఖర్, ఆర్ ఐ తిరుపతి, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎల్ రవీందర్, డాక్టర్ ఈ రవి అధ్యాపకులు భీమరావు, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ శ్రీలత, మహేందర్ రావు, డాక్టర్ సువర్ణ, ఆర్.ఈశ్వరయ్య, స్వరూప రాణి, దేవేందర్ రెడ్డి, పి శ్రీనివాస్ రెడ్డి, మమత, సుష్మ ,రవి ప్రకాష్, సుధాకర్, బీఎల్ వోలు అనూష, సంధ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.