వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం చీమల పేట గ్రామంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీమల పేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం అయిన తర్వాత మొదటిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తోంటి పద్మ -బుచ్చయ్య , గ్రామ సెక్రటరీ సంధ్యారాణి, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ జాతీయ జెండా ను ఆవిష్కరించిన అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.