వేద న్యూస్, చార్మినార్:
హైదరాబాద్ సిటీ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 2010-13 బ్యాచ్ విద్యార్థులు తమ కళాశాలలో గడిపిన క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఆనాడు సిటీ కాలేజీలో విద్యార్థులుగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్న విద్యార్థులు, తమ గురువులు చెప్పిన చదువుల వల్లే తాము ఉన్నత స్థాయికి చేరుకున్నామని అభిప్రాయపడ్డారు. తాము వివిధ రంగాలలో స్థిరపడినప్పటికీ.. తమ ఎదుగుదలకు మూలం, బాటలు వేసింది సిటీ కాలేజీ పాఠాలేనని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేష్ కుమార్, జీ శేఖర్, జీ శ్రీనివాస్, టీ మల్లేష్, జీ వెంకట్, ఎస్ వెంకటేష్, డీ రఘు, పీ రమేష్, కే శ్రీను, ఆర్ రాకేష్, ఎం నర్సింగ్, విష్ణు, డీ రవి పాల్గొన్నారు.