వేద న్యూస్, మరిపెడ:
టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నామ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనా చారి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో ఈ ఎన్నిక జరిగింది.
మండల అధ్యక్షులు గా గుగులోత్ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గా చెరుకుపల్లి ప్రభాకర్, ఉపాధ్యక్షులు గా ఆలేటి ప్రగతి, గుగులోత్ మంగు కోశాధికారి గా తల్లాడ శ్యామ్ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు ,ఆలువాల ఐలయ్య ,కొమ్మనబోయిన వెంకన్న, భీమాండ్ల సారయ్య, గుగులోత్ మంగిలాల్ ,ఇస్రత్ బేగం, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఆళ్ల మురళీకృష్ణ , సభ్యులుగా .రవి, నరసింహారావులు మహిళా సాంస్కృతిక కన్వీనర్ గా జ్యోతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా డెలిగేట్లుగా నందిగామ జనార్ధనా చారి, కోట వెంకన్న, రాజు, ప్రసాదరావును నియమించుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతల తెలిపారు.
మండల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భావజాలాన్ని పెంపొందిస్తామని, విద్యా వ్యవస్థ లో అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని వెల్లడించారు.