వేద న్యూస్, వరంగల్ టౌన్ :
వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగళ్ల పరమేశ్వర్ అన్నారు. సోమవారం హంటర్ రోడ్డులోని ఓ హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవినీతి, దోపిడీకి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు.
గతంలో మంత్రిగా చేసిన కేటీఆర్ మాట్లాడే పద్దతి మార్చుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంది అని అన్నారు. కేసీఆర్ పూర్తిగా డిక్టేటర్ లాగా ప్రవర్తించారని బీఆర్ఎస్ పతనం ఖాయమని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సేవకులని అన్నారు. రాష్ర్టంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం తప్పని అన్నారు. కేసీఆర్ పాలనలో భూములు కబ్జా చేశారని ఆరోపించారు.ప్రజాక్షేత్రంలో కచ్చితంగా కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.