వేద న్యూస్, జమ్మికుంట:
గాంధీజీ వర్ధంతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ప్రతి సంవత్సరం ఈ రోజునే గాంధీజీ వర్ధంతితో పాటు అమరవీరుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నామని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణారెడ్డి ముందుగా మాహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన మహానేతల్లో మహాత్మా గాంధీ అగ్ర గన్యులన్నారు. సత్యం అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి, భారతదేశ స్వేచ్ఛ కోసం, దేశ స్వతంత్రం కోసం స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు.
గాంధీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మునికి, అమరవీర మహా నేతలందరికీ బీజేపీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాడ గౌతంరెడ్డి జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, తూర్పటి రాజు, దొంతుల రాజ్ కుమార్, రాజేష్ ఠాకూర్, కైలాస్ కోటి గణేష్, మోడమ్ రాజు, రాకేష్ ఠాగూర్ బూరుగుపల్లి రాము, రవి తదితరులు పాల్గొన్నారు.