వేద న్యూస్, హుజురాబాద్:
‘రైతుబంధు’ పథకాన్ని 3 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే అమలు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ‘‘రైతుబంధు’’ పథకం 3 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు ఉన్న వ్యవసాయ భూమి రైతులకు మాత్రమే అమలు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో భూస్వాములకే ‘‘రైతుబంధు’’ అమలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 3 నుండి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఇవ్వాలని, నిజమైన రైతులను ఆదుకోవాలని వెల్లడించారు.