• ప్రజలను కోరిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ
  •  యార్డును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

వేద న్యూస్, వరంగల్/ఆత్మకూరు:
పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలకేంద్రంలో మంగళవారం మార్కెట్ యార్డు ప్రారంభోత్సవం జరిగింది. ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై తన చేతుల మీదుగా మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి లో భాగంగా మార్కెట్ యార్డ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రాజు ను అభినందించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించిలని ప్రజలను కోరారు.

గ్రామస్తులు, చుట్టూ ఉన్న గ్రామాలు మార్కెట్ సేవలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రాన్ని ప్రజా పాలన దిశగా అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు.

జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇన్ చార్జి మంత్రి పొంగులేటి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాధికా రాజు, ఎంపిపి సుమలత రజిని కేర్ వైస్ ఎంపిపి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపి బీరం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.