వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో తెలంగాణ రిటైర్డ్ కళాశాలల టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 డైరీని బుధవారం ఆవిష్కరించారు. ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పుల్లయ్య, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎం. ధర్మేందర్రావు, డాక్టర్ జగన్నాధ రావు తదితరులతో ఆ అసోసియేషన్ రాష్ట్ర బేవర్స్ మీటింగ్ ఎల్బీ కళాశాల సెమినార్ హాల్ లో జరిగింది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ కళాశాలల విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు. మెడికల్ రియంబర్స్ మెంట్ కోసం అసోసియేషన్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం..పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుండి పొందే అన్ని రకాల బెన్ ఫిట్స్ ను సానుకూలంగా పరిష్కరించుకునే విధంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కార్యక్రమంలో డాక్టర్ సి మదన్మోహన్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ రమాదేవి,, డాక్టర్ స్వదేశ్, డాక్టర్ మోహన్ రావు, శివశంకర్, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ శేఖర్ రావు రాష్ట్రస్థాయిలో ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు.