వేద న్యూస్, శాయంపేట:
శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆరె కులస్తులు హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓబీసీ సాధన సదస్సుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు దుర్నాల రాజు శనివారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరే కులస్తులకు ఓబీసీ ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆరె కులస్తులు ఐక్యంగా పోరాటం చేస్తేనే సమస్యల పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.