- వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని వినతి
- టికెటిస్తే ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచివస్తానని పెరుమాండ్ల ధీమా
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున ఖర్గేను న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం కాంగ్రెస్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కలిశారు. తనకు వరంగల్ లోక్ సభ సీట్ కేటాయించాలని బయో డేటా సమర్పించారు. సానుకూలంగా స్పందించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దాదాపుగా 15 లక్షలా 73 వేల పై చిలుకు ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తనకు అవకాశం కల్పిస్తే ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుపొందుతానాని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా సదుపాయాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు వరంగల్ కు కావాల్సి ఉందని స్పష్టం చేశారు. తాను వరంగల్ అభివృద్ధికి పని చేస్తానని వెల్లడించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించాలని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లి కలిసి వినతి పత్రం అందజేశానని రామకృష్ణ పేర్కొన్నారు.