• కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల

వేద న్యూస్, హుజురాబాద్/జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల శనివారం స్పందించారు. ఆసుపత్రి సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల కరెంటు ఉండేలా చూసుకోవడంతో పాటు నిరంతరం నీటి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణుల ప్రసవం సమయంలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం జిల్లా మంత్రుల లతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన సహకారము అందజేస్తారని తెలిపారు. రోగులకు సకాలంలో తగిన చికిత్స అందించాలని కోరారు.