- వరంగల్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని వినతి
- తన బయోడేటాను నాయకులకు సమర్పించిన పెరుమాండ్ల
- ప్రజల మద్దతుతో లోక్ సభ సభ్యునిగా విజయం సాధిస్తానని ధీమా
వేద న్యూస్, వరంగల్:
తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి అగ్రనేతలను వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ ఆదివారం కలిశారు. తొలుత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్ కేటాయించాలని కోరారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మరో ఇరువురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ సీనియర్ నేత వీ హనుమంతు రావు కూడా రామకృష్ణ వినతి పత్రం అందజేశారు.
వారందరూ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. అందరికి కృతజ్ఞతలు చెప్పారు. పార్టీ ఎంపీగా అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ల అభివృద్ధి, జిల్లా సంక్షేమము కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారం తో కష్టపడతానని తెలిపారు. పార్టీ మీద, ముఖ్యమంత్రి, జిల్లా నాయకుల మీద పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో తనకు అవకాశం కల్పిస్తే..ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో గెలుస్తానని రామకృష్ణ ఆశాభావంతో పాటు ధీమా వ్యక్తం చేశారు.