•  60 మందికి సర్టిఫికెట్, మెమొంటోలతో శాలువాలు కప్పి సత్కారం
  • విశిష్ట అతిథిగా ఆర్టీవో వివేకానంద రెడ్డి, ముఖ్య అతిథిగా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వెంకటరమణ
  •  మంచిర్యాల జెసిఐ-ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ సిరోమణి ప్రోగ్రాం విజయవంతం
  •  జేసిఐ మంచిర్యాల చైర్మన్ ఆరుముల్ల రాజు 

వేద న్యూస్, మంచిర్యాల:

జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న అభివృద్ధి, శిక్షణా తరగతులు, అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంచిర్యాల ఆర్టీవో ఎం వీ ఐ వివేకానంద రెడ్డి, జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ వెంకటరమణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిసిసి నస్పూర్ పరిధిలోని నరసయ్య భవనంలో ఆదివారం జే సి ఐ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జేసీఐ 3వ ఇన్స్టాలేషన్ సిరోమణి సెమినార్ పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఆర్టీవో -ఎం వి ఐ వివేకానంద రెడ్డి, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కౌశిక్ వెంకటరమణ హాజరయ్యారు. అలాగే జే సి ఐ రాష్ట్ర జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. జెసిఐ జిల్లా చైర్మన్ ఆరుముళ్ల రాజు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్ నాయకత్వంలో జరిగిన సెమినార్ కార్యక్రమంలో వివిధ రంగాలలో గొప్పగా రాణించి మంచి సాంఘిక సేవలందిస్తున్న ఉద్యోగులు, కళాకారులు, జర్నలిస్టులు, వ్యాపారస్తులు టీచర్లు తదితర విభాగాలలో పనిచేస్తున్న సుమారు 60 మంది సేవకులు,దాతలకు శాలువాలు కప్పి మెడలో పూలదండలు వేసి సర్టిఫికెట్లతో పాటు మెమొంటోలు-అవార్డులు సైతం బహుమతిగా ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ముందుగా జేసీఐ మంచిర్యాల నూతన అధ్యక్షుడి గా జేసీ డాక్టర్ వెంకటేష్ పాలకుల ఎన్నుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరాలో జెసిఐ మంచిర్యాల అధ్యక్షులుగా ఉన్న జేసీ రాజు అరుమూళ్ల త న చేతుల మీదుగా జేసిఐ ఇండియా కాలర్, గ్యావెల్ తో బాధ్యతలను వెంకటేష్ కు అప్పగించారు. 

కార్యక్రమం లో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్-జె సి ఐ జోన్ ప్రెసిడెంట్ గోవింద్ కనకని,జోన్ జెడ్ విపి ఆయుష్ సరోగి,జేసీ గెస్ట్ అఫ్ హానర్ గా కంపటి అనిల్ కుమార్, విశిష్ట అతిధి గా మంచిర్యాల ఆర్టీవో శ్రీ వివేకానంద రెడ్డి , ముఖ్య అతిధిగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కె. వెంకట రమణ హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జేసిఐ సంస్థ నాణ్యతకు,నాయకత్వనికి ఎంతో మంది వ్యాపార వేత్తలను తయారు చేయడం తో పాటు ట్రైనర్స్ ను, స్పీకర్లను తయారు చేసే అతి పెద్ద సంస్థ జేసీఐ మాత్రమే అని గొప్పగా కొనియాడారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఈ సెమినార్ ప్రోగ్రాం కు విచ్చేసిన అనేక విభాగాలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న సుమారు 60 మంది సాంఘిక సేవకులను ప్రభుత్వ సింగరేణి ఉద్యోగులు వ్యాపారస్తులు కళాకారులకు సర్టిఫికెట్లు మెమొంటోలు ప్రధానం చేయడంతో పాటు మెడలో పూలదండలు వేసి కప్పి అందర్నీ గౌరవంగా సత్కరించారు.