– సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్
– 69వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులు
వేద న్యూస్, ఎల్కతుర్తి:
రైతుల భాగస్వామ్యంతోనే బ్యాంకు అభివృద్ధి చెందిందని ది ఎల్కతుర్తి విశాల సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం 69 వ వార్షిక మహాసభ సంఘం కార్యాలయ ఆవరణలో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. సొసైటీ కార్యదర్శి జె.తిరుపతి సభకు నివేదిక సమర్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తమ పాలకవర్గం ఎన్నిక అయ్యే నాటికి అప్పులతో, కుంభకోణాలతో, కనీసం సున్నాలు వేసే స్థాయిలో కూడా సంఘం లేదన్నారు. తమ పాలకవర్గం ఎన్నికైన తర్వాత హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ , కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆశీస్సులతో, ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.10 కోట్ల టర్నో వర్ వరకు సంఘం చేరుకుందని వివరించారు. ఇది కూడా పాలకవర్గం సంఘ సభ్యులైన, రైతులకు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

అప్పట్లో జరిగిన ఫ్రాడ్ వల్ల నాబార్డ్ వాళ్లు సంఘానికి లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదని కానీ, తాము మూడేండ్లు కష్టపడి నాబార్డ్ లోన్ వచ్చేలా చేశామని చెప్పారు. నాబార్డ్ వాళ్లు జరిపిన ఆడిట్ లో సంఘం గ్రేడ్ డీ నుంచి గ్రేడ్ బీకి వచ్చిందని తెలిపారు. డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.1 కోటి 40 లక్షలా 74 వేల 730లు మన రైతులవేనని చెప్పారు. తాము బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏ ఒక్క రైతు కూడా ఎరువుల కోసం రోడ్డు ఎక్కలేదని గుర్తుచేశారు. వారికి సరిపోయే విత్తనాలు పెస్టిసైడ్స్ అందించామని స్పష్టం చేశారు. రైతుల వద్ద నుంచి ప్రతీ గింజ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేశామని చెప్పారు. అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా రుణాలు ఇచ్చి వసూలు చేస్తున్నామన్నారు. రైతుల సహకారంతో బ్యాంకులోని మినరల్ వాటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతుల సహకారంతో బ్యాంకును మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో రూ.రెండు కోట్ల 52 లక్షల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే కాగా, ఈ విషయమై హైకోర్టులో కేసు నడుస్తుందని, అందులోనుండి 10 లక్షల రూపాయల రికవరీ చేశామని వెల్లడించారు. సభ్యులైవరైనాన లేదా ఏ రైతు చనిపోయినా వారి కుటుంబానికి రూ.5 వేల నగదు సాయంతో పాటు ఒక క్వింటా బియ్యం అందించాలని మాజీ సర్పంచ్ గుండా ప్రతాపరెడ్డి సూచించారు. దానికి సానుకూలంగా సంఘం చైర్మన్ రవీందర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. పాలకవర్గంతో చర్చించి నిర్ణయాన్ని అమలయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎంపీపీ తంగడ నాగేష్, రైతుబంధు మండల కన్వీనర్, పోరెడ్డి రవీందర్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షులు బూర్గుల రామారావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, సీఈఓ తిరుపతి, పాలకవర్గం ముప్పు మహేందర్, లోకిని సూరయ్య, బరీదుల రాజిరెడ్డి, రమేష్, కాగితాల శ్రీనివాస్, ఎడవెల్లి సంధ్య, సమ్మక్క, నాగిళ్ల కృష్ణమూర్తి శర్మ, పోచయ్య, బ్యాంకు సిబ్బంది హింగే శివకుమార్, సురేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.