వేద న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక సహకార సంఘ సభ్యులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి, ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్, కోశాధికారిగా ముక్కెర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. సంఘ సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సంఘ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తామని సంఘ అధ్యక్షులు సారంగపాణి తెలిపారు.