• అధ్యక్షుడిగా మురళీధర స్వామి
  • కార్యదర్శిగా మేకల ఎల్లయ్య ఎన్నిక

వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ గురువారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడుగా వరయోగుల మురళీధర్ స్వామి, కార్యదర్శి గా మేకల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు వేల్పుల సంపత్, సహాయ కార్యదర్శి రాజమల్లు, కార్యవర్గ సభ్యులు ఖుద్రత్ అలీ, వంగా రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జంగం రాజలింగం తదితరులు ఎన్నికయ్యారు.