- హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
- ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
- గులాబీ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని వ్యాఖ్య..అండగా ఉంటానని సతీశ్ హామీ
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్ పార్టీ) కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ మీటింగ్ లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పి కొట్టాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి ప్రజలకు వివరించడం, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ప్రాధాన్యతను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వివరించారు. కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడు ఉంటానని హామీనిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.
కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్, గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.