- బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్
వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి:
వరంగల్ పరిధిలోని పిన్న వారి వీధి, ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధం గా సింగిల్ యుజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న 8 దుకాణాల పై బల్దియా కు చెందిన అధికారులు,సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని ప్లాస్టిక్ విక్రయిస్తున్న విక్రయదారుల కు రూ.1 లక్ష 3 వేల పెనాల్టీ విధించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందని బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్ తెలిపారు.
ఈ సందర్భంగా సిఎంహెచ్ఓ మాట్లాడుతూ నగరాన్ని ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించడం జరిగిందన్నారు.ఈ నేపథ్యంలో బల్దియా వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులతో గతంలో సమావేశం ఏర్పాటు చేసి సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయించవద్దని సూచించడం జరిగిందని అయినప్పటికీ కొంతమంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో దాడులు నిర్వహించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య,నరేందర్ సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, జవాన్లు తదితరులు పాల్గొన్నారు