వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండలకేంద్రంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకులు పొన్నం అనూప్, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే సంతాజీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ అంబాల శ్రీకాంత్ (బక్కి), ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శీలం అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రమేష్, గొర్రె మహేందర్, పాక రమేష్, నరేష్ గౌడ్, రాజయ్య గౌడ్, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు కొద్ది సేపు క్రికెట్ ఆడారు. ఎల్కతుర్తి ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) ప్రారంభం పట్ల పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.