వేద న్యూస్, హుజురాబాద్ / కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన తోడేటి సౌందర్య అనే మహిళ.. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పత్తి దగ్ధమై మృతి చెందింది. విషయం తెలుసుకున్న జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి శనివారం మర్రిపల్లిగూడెంకు వెళ్లారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబం వ్యవసాయ ఆధారిత కుటుంబమని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సౌందర్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించి వారిని అన్ని విధాల ఆదుకోవాలని కమలాపూర్ మండల తహసీల్దార్ ను , జిల్లా కలెక్టర్ ను, జిల్లా మంత్రి కొండా సురేఖను కోరారు.