వేద న్యూస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో ఆదివారం శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత.. కన్యకా పరమేశ్వరి దేవతకు పసుపు, కుంకుమ నీళ్లతో., పాలతో అభిషేకం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అలాగే సాయంత్రం అమ్మవారి పల్లకి సేవలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భగవద్గీత పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. పూజారి పారువెల్ల సంతోష్ ప్రత్యేక పూజలు చేశారు. కొల్లూరి జనార్ధన్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు డైత రాజేశం, నగునూరి ప్రసాద్, అల్లంకి లింగమూర్తి, అక్కినపల్లి సత్యనారాయణ, అయితు రమేష్, వాసవి క్లబ్ సభ్యులు , పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.