వేద న్యూస్,రాయపర్తి:
రాయపర్తి మండల నూతన ఎస్సైగా వడ్డె సందీప్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వడ్డె సందీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానని మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ,అధికారులు సహకరించాలని ఆయన కోరారు.