• అంగరంగ వైభవంగా బొడ్రాయి పున:ప్రతిష్టాపన
  • బొడ్రాయి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో వేలాది గా పాల్గొన్న ప్రజలు
  • ఆడపడుచులు, బంధువుల రాకతో ఇంటింటా సందడి

వేద న్యూస్, కరీమాబాద్: 

గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరిగింది. గత మూడు రోజులుగా కరీమాబాద్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

 

బుధవారం జరిగిన గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బొడ్రాయి దర్శనం చేసుకున్నారు. అనంతరం 

కరీమాబాద్ ప్రాంతంలోని మహిళలు బోనాలు సమర్పించారు. గ్రామదేవతలకు బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మధ్యాహ్నం ప్రాంత ప్రజలందరికీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.సాయంత్రం వేళ బొడ్రాయి కథను వినిపించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఆడబిడ్డలందరు,ప్రజలు పాల్గొన్నారు.