- Twjf హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్
వేద న్యూస్ , హుజురాబాద్/జమ్మికుంట:
పాత్రికేయుల సమస్యల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని (Twjf) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ కోరారు.
విలేకరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. ప్రతి జర్నలిస్టుకు నివేశనా స్థలాలను ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని, వారి ఉన్నతికి సహకరించి తోడ్పాటును అందించాలని విన్నవించారు.