వేద న్యూస్, సుల్తానాబాద్:
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపిఎస్ (డిఐజి) ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాలలోని కమిటీ సభ్యులతో అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇది మనందరి జాతర అని అమ్మవార్లకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.

జాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, యువత సమన్వయం చేసుకొని జాతరను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు లక్షల్లో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తారు కనుక వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని పేర్కొన్నారు.

కమిటీ సభ్యులు, యువత, స్థానిక ప్రజలు పోలీసులు కలిసి పని చేస్తే జాతరను విజయవంతంగా నిర్వహించుకోగలుగుతామని సూచించారు. ఇందుకు ముఖ్యంగా యువత సహకరించాలని ఏసీపీ కోరారు.

జాతర కు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాల ఏర్పాట్లు, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగా కుండా, జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారుల మరమ్మతు, పార్కింగ్ స్థలాల గుర్తింపు, త్రాగు నీటి ఏర్పాట్లు, స్నానాలు ఘాట్ పరశీలన, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు, విద్యుత్ లైట్స్, సౌకర్యం, సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ఏర్పాట్లు, ప్రస్తుతం ఉన్న సదుపాయాలు, కావాల్సిన వాటిపై చర్చించి, పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో సీఐ సుల్తానాబాద్ కె.జగదీష్, జూలపల్లి ఎస్ ఐ ఎన్.శ్రీధర్, పొత్కపల్లి ఎస్‌ఐ జి.అశోక్‌రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్‌ఐ బి.ఓంకార్ యాదవ్, సుల్తానాబాద్ ఎస్ఐ బి.వినిత, సర్కిల్ పరిధిలోని జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.