•  బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష
    వేద న్యూస్, జమ్మికుంట:

    జమ్మికుంటలోని హరిహర థియేటర్ లో నేటి(ఆదివారం) నుంచి ప్రదర్శితమయ్యే ‘ప్రవీణ్ ఐపీఎస్’ మూవీ చూడాలని ప్రజలను బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష కోరారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కరీంనగర్ ఎస్పీగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.. అడవి బాట పట్టిన వారిని జనజీవన స్రవంతిలో ఎలా కలిపారు? అడిషనల్ డీజీపీగా గురుకులాల కార్యదర్శిగా పనిచేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలని ఎలా ఉన్నత శిఖరాలు చేరే విధంగా ఎలా తయారు చేశారు? ఇప్పుడు అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలి ప్రజల మధ్యలో వచ్చి ప్రజాసేవ చేయాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ‘‘ప్రవీణ్ ఐపిఎస్ ఇక ప్రజాసేవలో’’ అనే సినిమా అని స్పష్టం చేశారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ మూవీ విడుదల అవుతోందని వెల్లడించారు. ప్రజలు, విద్యార్థులు, తన అభిమానులు కుటుంబ సమేతంగా వచ్చి ఈ బయోపిక్ ని చూడవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ ఆకినపల్లి శిరీష కోరారు.