– ఆత్మీయ అతిథిగా చిన్న‘నాటి’ స్నేహితురాలు
– సడెన్గా వచ్చి సర్ప్రైజ్..చిరు సత్కారం
వేద న్యూస్, కమలాపూర్:
తనతో పాటు కలిసి చదువుకున్న స్నేహితురాలిని ఏండ్ల తర్వాత కలిసి సంతోషపడ్డారు కమలాపూర్ ఎస్ఐ సీమ ఫర్హీన. వివరాల్లోకెళితే..కమలాపూర్ మండల సబ్ ఇన్ స్పెక్టర్ సీమ ఫర్హీన, మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన రేష్మ 11 ఏండ్ల కిందట పెద్దపల్లిలో బీటెక్ చదువుకున్నారు.
ఈ నేపథ్యంలో కమలాపూర్ మండలానికి ఎస్ఐగా వచ్చిన సీమ ఫర్హీన ఆదివారం తన స్నేహితురాలిని సబ్ ఇన్ స్పెక్టర్ హోదాలో వెళ్లి కలిసింది. కాగా, తనను గుర్తుపెట్టుకుని మరి కలవడానికి ఎస్ఐ సీమ రావడం పట్ల రేష్మ సంతోషం వ్యక్తం చేసింది.
అనుకోని ఆత్మీయ అతిథిగా ఎస్ఐ
తన ఇంటికి అనుకోని ఆత్మీయ అతిథిగా వచ్చిన చిన్న‘నాటి’ స్నేహితురాలిని చూసి మర్రిపల్లిగూడెం వాసి రేష్మ ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ఐను శాలువాతో సత్కరించి, ఆ నాటి కాలేజీ రోజులను ఇరువురు గుర్తు చేసుకున్నారు.