వేద న్యూస్, హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు కత్తులు శ్రీనివాస్ యాదవ్-లోహిత ల వివాహ రిసెప్షన్ పెర్కపల్లి లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్షప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) సోమవారం హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు.
జేఎస్ఆర్ వెంట బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, గొల్లపల్లి విరాచారి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్, సంపత్ నాయక్, రాం ప్రసాద్,రాజేందర్,శ్రీనివాస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.