•  ఎల్కతుర్తిలో ఘనంగా ఛత్రపతి జయంతి
    వేద న్యూస్, ఎల్కతుర్తి:

    ఆరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఆరె కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ 394వ జయంతి సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు కుడితాడి రాజు, ప్రధాన కార్యదర్శి హింగే రవీందర్ జెండా ఆవిష్కరించారు.

 

అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వీట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై రాజకుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, సంఘం జిల్లా నాయకులు సుకినె సుధాకర్, సంఘం హన్మకొండ జిల్లా కార్యదర్శి హింగె భాస్కర్, సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, నాయకులు సుకినె సంతాజీ, కుడితాడి చిరంజీవి, గోలి రాజేశ్వర్ రావు, బూర్గుల రామారావు, కడారి రాజు, నిరంజన్ రెడ్డి, కుడితాడి అనిత రాజు, హింగె రాజేశ్వరరావు, హింగే రవి, బూర్గుల ఫిరోజి, అంబీరు నర్సింగం, మల్లయ్య. బుసారీ శివాజీ, ఆరె కులస్తులు, ఛత్రపతి శివాజీ మహరాజ్ అభిమానులు తదితరులు హాజరయ్యారు.