వేద న్యూస్, కరీంనగర్:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీడీఎస్ యూ జిల్లా కమిటీ పక్షాన పెద్దపెల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ కి వినతి పత్రం సోమవారం సమర్పించారు.

గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. వినతి పత్రంలో ఖాళీల భర్తీ గురించి వివరించారు. గురుకుల పోస్టులన్నిటిని పైనుంచి కిందికి (డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ) పద్ధతిలో భర్తీ చేయాలని, టీఎస్ పీఎస్ సీ జేఎల్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు.

అభ్యర్థుల నుండి రిలింక్విష్ మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలని, పోస్టులు బ్యాక్ లాగ్ గా మిగిలిపోకుండా రెండో లిస్టును ప్రకటించాలని, అన్ని పోస్టులకు జనరల్ ర్యాంక్ లిస్టు(జీఆర్ఎల్) ను ముందుగానే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాదావత్ సన్నీ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.