వేద న్యూస్ , జమ్మికుంట:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి పట్ల జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
లాస్య నందిత తండ్రి కంటోన్మెంట్ మాజీ సీనియర్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెంది సంవత్సరకాలం గడవకముందే.. తన కూతురు అదే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్న తరుణంలో.. యాక్సిడెంట్లో దుర్మరణం చెందడం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలను రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
తన ఆకస్మిక మరణం అత్యంత విచారకరమని, ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వాసు వడ్లూరి ప్రకటించారు.