- జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్ :
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులకు గత ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి మొదటి విడత మంజూరు చేసిందని కాగా, ‘రెండో విడత’ను ప్రస్తుత సీఎం ప్రకటించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి సోమవారం కోరారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో పథకం సొమ్ము ఫ్రీజ్ చేయబడి..నిధులు విడుదల కాలేదని తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న సొమ్ము పై ఫ్రీజ్ ను రాష్ట్రప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దళితులకు షట్టర్ల కిరాయిలు కట్ట లేని పరిస్థితిలో ఉన్నారని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘దళిత బంధు’ రెండో విడత నిధుల మంజూరు కోసం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యేల వెంకన్న, భాష వేన కుమార్, ఎస్ ఎస్ బి ఎం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, కొలిపాక సుమన్, వీరబోయిన కొమురయ్య, కోహెడ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.