- టీఎల్‌యూ రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్
- ఘనంగా టీఎల్‌యూ ఆవిర్భావ దినోత్సవం
వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ పట్టణంలో ప్రెస్ భవనంలో తెలంగాణ లేబర్ యూనియన్(టీఎల్ యూ..రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధం) ఐదో ఆవిర్భావ దినోత్సవాన్నిఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజేయ్ ఉత్సవాలకు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ యూనియన్ పోరాటం చేస్తోందని చెప్పారు. అనంతరం తెలంగాణ లేబర్ యూనియన్ లోగోను విడుదల చేశారు. కొత్త రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో స్థానికులకు ఉపాధి కరువైందని, రాష్ట్రానికి వలస కార్మికులు రావడం వల్ల స్థానిక కార్మికులకు ఉపాధి దొరకడం లేదని వివరించారు. వలస కార్మికులకు బడ వ్యాపారుల దగ్గర భద్రత లేదని కార్మికుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడం వల్లనే అనేక కార్మికులు సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలు అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ లేబర్ యూనియన్ పక్షాన శివరాజ్ కోరారు.
కార్యక్రమంలో ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు జంగా అపర్ణ, జిల్లా కార్మిక సంఘాల చైర్మన్ కన్నం లక్ష్మణ్, పీడీఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి రాములు, ఆల్ భవన నిర్మాణ ప్లంబర్ కార్మిక సంఘం జంగా కొమురయ్య యాదవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాసిపాక అజయ్, మంచిర్యాల జిల్లా మహిళా కార్మిక అధ్యక్షురాలు జగదంబుల లలిత, మంచిర్యాల మహిళ కార్మిక ఉపాధ్యక్షురాలు మొహరం మిరియా, ఎడెల్ల వెంకటేష్, వడ్లులూరి సంతీష్, కార్మిక సంఘాల నాయకులు గందె కొమురయ్య ముదిరాజ్, లలిత,కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.