- కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు
- ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ హస్తం పార్టీ అని వ్యాఖ్య
వేద న్యూస్, ఇల్లందకుంట:
ప్రజా సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు ఇంగిలె రామారావు అన్నారు. సోమవారం ఇల్లందకుంట మండలకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రజల వద్దకే నిజమైన ప్రజా పాలన అందించే దిశగా అడుగులు పడ్డాయన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్, ‘చేయూత’ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల బీమా ఇప్పటికే అమలు చేసిందని గుర్తుచేశారు. అదే విధంగా రేపు (మంగళవారం) చేవెళ్ల వేదికగా ప్రియాంక గాంధీ చేతుల మీద కాంగ్రెస్ పార్టీ మరో రెండు గ్యారెంటీలు ‘మహలక్ష్మి’ పథకం కింద రూ.500 వందలకు గ్యాస్ సిలిండర్ , గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి మాట తప్పే అలవాటు లేదని, మడమ తిప్పే అలవాటు లేదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను అర్హులకు అందేలా చూస్తామని వెల్లడించారు. ప్రజల ఎవరు కూడా భయాందోళనకు గురికావద్దని, ఏవైనా సమస్యలు ఉంటే తెలిపాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని ప్రకటించారు.