•  రేపు చేవెళ్ల నుండి మరో రెండు పథకాలకు సు”ముహూర్తం”
  •  హుజురాబాద్ నియోజకవర్గ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు
  •  కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్

వేద న్యూస్, జమ్మికుంట:
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నమని ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

రేపటి(మంగళవారం) నుండి మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను తెలంగాణ ప్రజలు,హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలనీ కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను అమలుచేశామని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం,ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు పెంపు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను విస్మరించే ప్రభుత్వం తమ సర్కార్ కాదని, ప్రస్తుతం ప్రజా పరిపాలనలో నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమని వెల్లడించారు.

చేవెళ్ల సభ ద్వారా రెండు గ్యారంటీలను ప్రియాంక గాంధీ చేత ప్రారంభిస్తున్నామని ఇది శుభపరిణామనీ పేర్కొన్నారు. గతంలో గ్యాస్ బండ గుదిబండగా తయారైందని, సామాన్య ప్రజలకు సమస్యగా ఉన్న సిలిండర్ ధరను కాంగ్రెస్ ప్రభుత్వ రూ.500 లకే ఇస్తున్నామని వివరించారు.

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ గురించి స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారని చెప్పారు. దానితో పాటు రైతుకు పెట్టుబడి సహాయం కింద అందజేసే ‘రైతు భరోసా’ పథకాన్ని కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు. ఇది పూర్తిగా రైతు, కార్మిక, కర్షక ప్రభుత్వమని మరోసారి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటిలను అమలు చేస్తామని వెల్లడించారు.