– తపాల శాఖ ఆధ్వర్యంలో చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’
వేద న్యూస్, మరిపెడ:
తపాల శాఖ ఆధ్వర్యంలో కురవి వీరభద్రస్వామి ఆలయంలో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. భారత ప్రభుత్వం తపాల శాఖ ఆధ్వర్యంలో చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించాలనే ఆదేశానుగుణంగా ఆదివారం కురవి వీరభద్రస్వామి గుడిలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛత ఉద్యమంలో భాగం పంచుకోవాలని కోరారు. బాపూజీ కలలను నెరవేరుద్దాం అని చెప్పారు. ప్రతి గ్రామం వీధి పట్టణం నగరం అంతటా స్వచ్ఛతను పాటించాలని, స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రభుత్వ రంగం పెద్ద పాత్ర పోషిస్తుందని వివరించారు. అందరు శౌచాలయాలను ఉపయోగించని, చెత్తను చెత్తబుట్టలో వేయాలని సూచించారు.
ఈ స్వచ్ఛతా-హీ-సేవ కార్యక్రమంలో సత్యనారాయణ దేవదాయ శాఖ అధికారి కురివి వీరభద్ర స్వామి ఆలయం, రవి అకౌంటెంట్, మహేష్ వీరభద్ర స్వామి ఆలయ ఉద్యోగులు, తపాల శాఖ తరఫున జాటోత్ యాకూబ్ ఎస్.పి.ఎం కురవి, పెండ్ర రామచందర్ పోస్ట్మాస్టర్, కోట సుధాకర్ ఎస్.పి.ఎం యస్.వి.న్ రోడ్, వాసం అనిల్ కుమార్ సిపిసి బ్రాంచ్ ఇన్ చార్జి, సురేష్ ఎస్.పి.ఎం న్యూయాబాది, జి. సుధాకర్, బి.ప్రశాంత్ మెయిల్ వర్సెస్ మహబూబాబాద్, బోడ వినోద్ కుమార్ బి.పి.ఎం లక్ష్మీపూర్, కురవి ఉప తపాల కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.