వేద న్యూస్, ఆసిఫాబాద్:

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని  బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ ఆస్పిరెంట్, సినీ నటుడు అభినవ సర్దార్ ఖిలావత్ అన్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రేమల గార్డెన్ ఆవరణలో నిర్వహించిన సేవాలాల్ 285 వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

తను ఎన్నో సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తనకు టికెట్ ఇస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని  వెల్లడించారు.

ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అనేక ప్రాంతాలు కనీస మౌలిక వసతులు లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ప్రజలతో మమేకమై పనిచేస్తున్నానని ఎంపీగా అవకాశం ఇస్తే మరింత కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు ఆత్మరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.