- ప్రజల అభినందన..ప్రశాంత వాతావరణంలో జాతర
- పారిశుధ్య నిర్వహణ భేష్.. అధికారులు, సిబ్బంది పని తీరు పట్ల ప్రశంసలు
వేద న్యూస్, హన్మకొండ:
మినీ మేడారం గా ప్రసిద్ధి గాంచిన ఆత్మకూరు మండలం లోని అగ్రంపాడు(రాఘవపురం) సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
ఈ సందర్భంగా జాతరకు హాజరైన భక్తులు, జనం అభినందిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెలకు చేరుటకు ముందు నుండే పారిశుధ్య పనులను చేయించారు. దామెర, ఆత్మకూరు మండలాల పంచాయతీ కార్యదర్శులు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది, కూలీలతో ఎప్పటికప్పుడు తల్లుల గద్దల దగ్గర, చుట్టూ పక్క పరిసరాల్లో చెత్త చెదారంను తొలగించారు.
తొలగించిన ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి..రోడ్లను ఊడ్చి నీట్ గా ఉంచారు. ఎప్పటికప్పుడు చేపట్టే పారిశుధ్య పనులను చూసిన భక్తులు పంచాయతీ కార్యదర్శుల కృషిని, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.