వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తి మృతి చెందినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాటుఫామ్ నెంబర్ 1 పై ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
మృతుడిని పరిశీలించగా, అతని వద్ద జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ స్లిప్ ఉందని, దాని ప్రకారం మృతుడి పేరు సాగర్ తండ్రి జితేందర్ అని ఉందని, జమ్మికుంటకు చెందినట్లు ఉందని పేర్కొన్నారు. మృతుడి వయసు 50 సంవత్సరాలు ఉందని, ఈ వివరాలు తప్ప ఆతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. మృతుడు అనారోగ్యం వలన చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
మృతుడు బ్లూ కలర్ ఫుల్ షర్ట్, దానిపై పసుపు రంగు నిలువు గీతల డిజైన్ , బ్లాక్జ్ లోయర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏమైనా వివరాలు తెలిసినచో ఫొన్ నంబర్లు 9949304574, 8712658604 కి తెలియపరచాలని హెడ్ కానిస్టేబుల్ తిరుపతి సూచించారు. మృతదేహాన్ని జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.