– మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్
– 6 వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులు హాజరు
వేద న్యూస్, మరిపెడ:
దీన్ దయాళ్ స్పర్ష్ ఉపకార వేతనాల పోటీ పరీక్షకు విశేష స్పందన వచ్చినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. గుర్తింపు పొందిన మహబూబాబాద్ పట్టణంలోని వివిధ పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు 105 మంది ఈ పరీక్షకు ఒక ప్రైవేటు పాఠశాల పరీక్ష కేంద్రంలో ఆదివారం ‌హాజరు అయ్యారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కో తరగతి నుంచి 40 మంది చొప్పున రెండో దశ పరీక్షకు ఎంపిక చేసి రెండో దశ పోటీ పరీక్షలో తపాలా బిళ్లలపై ప్రాజెక్టు వర్కు సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రాజెక్టు వర్క్ 4 నుంచి 5 పేజీల్లో ఉండాలి. ఇందులోంచి తరగతికి పది మంది చొప్పున విజేతలను తపాల శాఖ ఎంపిక చేస్తారు. విజేతలుగా ఎంపికైన వారికి ఒక్క సంవత్సరానికి త్రైమాసికానికి రూ.1500 చొప్పున ఏ మొత్తం రూ.6 వేల రూపాయల నగదు బహుమతి విద్యార్థుల పొదుపు ఖాతాలో జమ చేస్తారు. అలాగే పాఠశాల విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి పెంచేందుకే ఈ ఉపకార వేతనాలు బాగా ఉపయోగపడతాయని ఉపకార వేతనాల పోటీ పరీక్ష పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ వెల్లడించారు. ఈ ఎగ్జామ్ కు ఇన్విజిలేటర్స్ గా జాటోత్ యాకూబ్ యస్.పి.యం కురవి, వాసం అనిల్ కుమార్ సిపిసి బ్రాంచ్ ఇంచార్జ్, నరసయ్య యస్.పి.యం కంబాలపల్లి, రామగిరి ప్రభాకర్, జి. సుధాకర్, బి.ప్రశాంత్ మెయిల్ వర్సెస్, బి. వెంకన్న యం.టి.స్ మహబూబాబాద్ , ప్రధాన తపాల కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.